100 అడుగుల ఎత్తులో ఆగిపోయిన రోలర్ కోస్టర్
- May 02, 2018పశ్చిమ జపాన్‌లోని యూనివర్శల్ స్టూడియోస్ ఎమ్యూజ్మెంట్ పార్కులో ఒక రోలర్ కోస్టర్ ఉన్నట్టుండి ఆగిపోయింది. దీనితో రోలర్ కోస్టర్‌లో విహరిస్తున్న సుమారు 64 మంది 2 గంటలపాటు వేలాడుతూ ఉండిపోయారు. ఎమర్జెన్సీ స్టాప్ కారణంగా ఆగిపోవటంతో 100 అడుగుల ఎత్తులో చిక్కుకుపోయారు. పార్కు సిబ్బంది ఎమర్జెన్సీ మార్గంలో బయటకు తీసుకువచ్చారు. ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగలేదు. గతంలో కూడా ఇటువంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. 1120 మీటర్ల పొడవైన ఈ రోలర్ కోస్టర్‌ను 2016 మార్చిలో ప్రారంభించారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్‌లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!