వేగంతో వీస్తున్న గాలులు.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు.. భయాందోళనలో జనం..

- May 02, 2018 , by Maagulf
వేగంతో వీస్తున్న గాలులు.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు.. భయాందోళనలో జనం..

అండమాన్ ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అలాగే మహారాష్ట్ర నుంచి కర్నాటక మీదుగా తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి, రాజస్థాన్ నుంచి పశ్చిమ బెంగాల్‌ మీదుగా మణిపూర్ వరకు మరో అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. వీటన్నంటి ప్రభావంతో కోస్తాంధ్రలో చాలాచోట్ల విస్తారంగా వర్షాలు పడ్తున్నాయి. తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి. వేటకెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. పార్వతీపురంలో గంటకు పైగా కుండపోతగా వర్షం పడింది. దీంతో రోడ్లు చెరువులను తలపించాయి. పిడుగులు పడడంతో జనం తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. గజపతినగరం, మెంటాడ, బొండపల్లి, దత్తిరాజేరు మండలాల్లో ఏకధాటిగా వర్షం పడింది. ఏజేన్సీ ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com