ఇసుక తుపానులో అనుష్క శర్మ..
- May 03, 2018
ప్రకృతికి అందరూ సమానమే. పేద, గొప్ప, చిన్నా, పెద్దా అనే తేడా వుండదు. సాంకేతికత మోజులో టెక్నాలజీ వెంట పరుగులిడే మనిషి మేధస్సు ఎంత గొప్పదైనా ప్రకృతికి తలవంచాల్సిందే. ఎంత పెద్ద పర్వతమైనా అద్దంముందు మరగుజ్జే అన్నట్లు..ఎంత పెద్ద రాజకీయ నాయకుడైనా..ఎంతపెద్ద హీరో అయినా..ఎంత భారీ రెమ్యూన్ తీసుకుంటున్నా...ఒక్కొక్కసారి సాధారణ ఇంకా చెప్పాలంటే అతి సాధారణ వ్యక్తుల్లా మిన్నకుండిపోవాల్సిందే. టెక్నాలజీని సృష్టించిన మానవుడు ప్రకృతిని అదుపులో వుంచేందుకు పలు ప్రయత్నాలు చేస్తునే వున్నాడు. కానీ అది మాత్రం సాధ్యం కావటంలేదు. ఎందుకంటే మనిషి మేధస్సు కంటే ప్రకృతి శక్తివంతమైనది. అది ఒక్కసారి విశ్వరూపం చూపిందంటే అన్నీ తుడిచిపెట్టుకుపోవాల్సిందే. ఇప్పుడు అదే జరిగింది. మండు వేసవిలో తెలుగు రాష్ట్రాలలో అకాల వర్షాలు అతలా కుతం చేసేస్తున్నాయి. మరోపక్క ఉత్తరప్రదేశ్ లో వడగళ్ల వాన బీభత్సానికి రాజస్థాన్ లో దాదాపు 50 మంది మృతి చెందారు. ఇక ఎడారి అంటేనే గుర్తుకొచ్చే రాష్ట్రం అయిన రాజస్థాన్ లో ఇసుక తుపాను బీభత్సాన్ని సృష్టించటమే కాక పదుల సంఖ్యలో ప్రాణాలను బలితీసుకుంది. ఈ నేపథ్యంలో బాలివుడ్ హీరోయిన్ అనుష్క శర్మ తుపానులో చిక్కుకున్న చిరునావలా అల్లాడిపోయింది.
ఇసుక తుపానులో అనుష్క శర్మ..
ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ అనుష్కశర్మ ఇసుక తూఫాన్ లో చిక్కుకు పోయింది. ఏం చేయాలో తోచక అల్లాడిపోయిందట. ఇసుక తుపాను అనుష్కకు చుక్కలు లేక్క పెట్టిందట. ఏం చేయాలో తోచని విపత్కర పరిస్థితిలో నరకం చూసానటోంది ప్రముఖ క్రికెట్ స్టార్ భార్య బాలివుడ్ హీరోయిన్ అనుష్క శర్మ. రాజస్థాన్‌లో జరుగుతన్న ఓ షూటింగ్ కు అటెండ్ అయిన అనుష్కకు ఎదురైన రియల్ స్టొరీ ఇది. అనుష్కశర్మ లేటెస్ట్ మూవీ 'ఎన్‌హెచ్ 10'. నవదీప్‌సింగ్ డైరెక్షన్ చేస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ మూవీని సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాత ప్లాన్ చేస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్‌గా రానున్న ఈ చిత్రం షూటింగ్ రాజస్థాన్‌లోని ఎడారి ప్రాంతంలో జరుగుతోండగా ప్రమాదవశాత్తు హఠాత్తుగా ఇసుక తుపాన్ రావడంతో షూటింగ్‌కు అంతరాయం కలగటమే కాక అనుష్కకు భయమేంటే ఏమిటో రుచి చూపించిందట. అసలే ఎడారి... ఆపై ఎక్కడికి వెళ్లాలన్నా వెళ్లలేని పరిస్థితి. ఆ సమయంలో ఏం చెయ్యాలో తోచక దాదాపు అర్థగంటపాటు దుమ్ము ధూళిల మధ్య ఈ బ్యూటీ ఉక్కిరిబిక్కి అయ్యాను అంటూ ఆ విషయాన్ని తన ట్విటర్‌లోపెట్టింది. అయితే యూనిట్ సభ్యులతోపాటు అందరూ క్షేమంగా బయటపడ్డామని పోస్ట్ చేసింది. ఇసుక తుపాను వస్తే ఆ క్షణం ఎలా వుంటుందో కళ్లతో చూశానని అనుష్క ఆ సంఘటనలను తరిచి తరిచి గుర్తుకు చేసుకుని నిద్రలో కూడా ఉలిక్కి పడుతోంది అందాల అనుష్క శర్మ..
తాజా వార్తలు
- హైదరాబాద్ లో మెక్ డొనాల్డ్స్ ప్రారంభించిన డిప్యూటీ CM భట్టి, మంత్రి శ్రీధర్ బాబు
- తెలుగు రాష్ట్రాల మధ్య రైలు సేవలకు నూతన ఊపు!
- తెలంగాణ క్యాబినెట్ లో కీలక మార్పులు
- తమిళనాడులో బయటపడ్డ భారీ జాబ్ స్కామ్
- 'కార్టూన్లు ద్వారా తెలుగు వికాసం' పోటీ విజేతల ప్రకటన
- ఫుజైరాలో విషాదం.. నీట మునిగి 2 ఏళ్ల బాలుడు మృతి..!!
- బహ్రెయిన్ లో ఫలించిన హమాలా వాసుల పోరాటం..!!
- బర్కాలో స్పెషల్ ఆపరేషన్..భారీగా డ్రగ్స్ స్వాధీనం..!!
- కువైట్ లో రికార్డు స్థాయిలో పెరిగిన వాహనాలు..!!
- ప్రాణాలను కాపాడేందుకే అత్యవసర రక్తదాన కాల్స్..!!







