'బిగ్ బి' పాడిన పాట విడుద‌ల‌

- May 03, 2018 , by Maagulf
'బిగ్ బి' పాడిన పాట విడుద‌ల‌

ఉమేశ్ శుక్లా ద‌ర్శ‌క‌త్వంలో  బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్  ప్రధాన  పాత్రలో  తెరకెక్కుతున్న చిత్రం  102 నాటౌట్ .    ఈ చిత్రంలో  102 ఏళ్ల కురువృద్ధుడిగా అమితాబ్, 75 ఏళ్ల వయసున్న కొడుకుగా రిషి కపూర్ నటిస్తున్నారు. రచయిత సౌమ్యజోషి రాసిన నాటకం ఆధారంగా ఈ మూవీని నిర్మించారు.  త్వరలో   విడుదల కానున్న  ఈ సినిమాకి భారీ ప్ర‌మోష‌న్స్ చేస్తున్నారు.అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి వ‌క్త్ నే కియా సాంగ్ విడుద‌ల చేశారు. ఈ  పాటను  అమితాబ్ ఆల‌పించ‌డం విశేషం.ఈ సినిమాలో బ‌డుంబ అనే మరో  ఎనర్జిటిక్ సాంగ్‌ని కూడా అమితాబే  పాడారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com