వేసవిలో తాగాల్సింది శీతలపానీయాలు కాదు.. కొబ్బరి నీళ్లు

- June 03, 2018 , by Maagulf
వేసవిలో తాగాల్సింది శీతలపానీయాలు కాదు.. కొబ్బరి నీళ్లు

కొబ్బరి బొండం గొప్ప పోషకాలను కలిగిన సహజ పానీయమని, దీనిని తీసుకోవడం వలన అనేక ఆరోగ్యప్రయోజనాలున్నాయని వైద్య నిపుణులు చెపుతుంటారు. వేసవికాలంలో ప్రజలు కొబ్బరి బొండాన్ని విరివిగా వినియోగిస్తారు. ముఖ్యంగా శీతల పానీయాలకు బదులుగా సహజసిద్ధమైన హైడ్రేటింగ్ ఏజెంట్లకు ప్రాధాన్యతనిచ్చే వారందరూ ఈ కొబ్బరిబొండాలను ఎక్కువగా వినియోగిస్తుంటారు. వ్యాధి రహితమైన జీవితాన్ని ఆస్వాదించుటకు ఉపయోగపడుతుంది.

తలనొప్పి వంటి చిన్నచిన్న రుగ్మతలు కూడా రోజువారి కార్యకలాపాలను బాగా దెబ్బతీస్తుంది. కాబట్టి వ్యాధులను నివారించుటకు సాధ్యమైనంతవరకు కొబ్బరి నీళ్లను తీసుకుంటే మంచిది. కొబ్బరినీళ్లలలో తేనెను కలిపి ప్రతిరోజు తీసుకోవడం వల్ల అనేక వ్యాధుల వ్యాప్తికి దూరంగా ఉండవచ్చు. రోగనిరధకశక్తిని పెంపొందించి, ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. 
 
తేనెలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు, కొబ్బరినీళ్లలో ఉన్న విటమిన్ సి వంటి కారకాలు ఒకటిగా కలిసి మీ శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి పోరాడటానికి సహాయపడుతాయి. కొబ్బరినీళ్లు, తేనెతో తయారుచేసిన పానీయం తీసుకుంటే జీర్ణవ్యవస్థను మెరుగుపరుచుటకు ఉపయోగపడుతుంది. దానితోపాటుగా మలబద్దకాన్ని కూడా నివారించి ఉపశమనం కలుగజేస్తుంది. 
 
పానీయంలో ఉన్న ఫైబర్, ప్రేగులలో గల నిక్షేపాలను సరళతరం చేస్తూ, బయటకు వెళ్లేలా చేస్తుంది. మలబద్దకాన్ని నివారించి, ప్రేగుల ఆరోగ్యాన్ని కాపాడటానికి ఈ కొబ్బరి నీళ్లు చాలా ఉపయోగపడుతాయి. 
 
గ్యాస్ సమస్యలకు, కడుపులో మంట, అల్సర్‌‌ వంటి కారకాలను తగ్గిస్తుంది. కిడ్నీలలో రాళ్ళను కరిగిస్తుంది. కొలెస్ట్రా‌‌ల్‌ను, బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రిస్తుంది. ఈ కొబ్బరినీళ్లలో యాంటీ బాక్టీరియా, యాంటి షూగర్ లక్షణాలు ఉంటాయి. చర్మానికి నిగారింపునిస్తుంది.  స్కిన్ ఇన్ఫెక్షన్స్ లేకుండా చేస్తుంది. క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. నీరసం, దప్పిక వంటివాటిని తగ్గిస్తుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com