అమెరికాలో తెలుగు యువకుడు మృతి
- June 03, 2018
న్యూయార్క్: స్నేహితులతో కలిసి సరదాగా బోటింగ్‌కు వెళ్లిన అనూప్ తోట(26) అనే తెలుగు యువకుడు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. ఇండియానాలోని బ్లూమింగ్‌టౌన్ సమీపంలో ఉన్న మాన్రో సరస్సులో అతను గల్లంతయ్యాడు.
బోటింగ్ అనంతరం అనూప్ సరదాగా ఈతకొట్టాడని ఈ క్రమంలోనే సరస్సులో గల్లంతయ్యాడని స్నేహితులు వెల్లడించారు. అనూప్ గల్లంతవడంతో 911 నంబరుకి ఫోన్ చేసి రెస్క్యూ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో రెస్క్యూ సిబ్బంది సరస్సులో గాలించగా 2రోజుల తర్వాత అనూప్ మృతదేహం లభ్యమైంది. అనూప్ మృతి వార్త తెలిసిన తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.
అనూప్ స్నేహితులు సైతం కన్నీటిపర్యంతమయ్యారు. ఈత కొడుతున్న సమయంలో పెద్ద అల అతన్ని బలంగా ఢీకొట్టడంతోనే అతను మునిగిపోయాడని, ఆ తర్వాత అతను కనిపించలేదని వారు వాపోయారు. అనూప్ కుటుంబాన్ని ఆదుకోవడానికి గో ఫండ్ ద్వారా నిధులు సేకరించే ప్రయత్నం కూడా మొదలుపెట్టారు.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







