ఎక్స్పోజింగ్ దుస్తులతో ఎక్స్‌ట్రాలు..
- June 12, 2018సమయం, సందర్భాన్ని బట్టి డ్రెస్సింగ్ సెన్స్ ఉండాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, పవిత్రమైన దేవాలయాలకు వెళ్లేటప్పుడు నిండైన బట్టలతో భగవంతుడిని దర్శించాలి. చూపరులకు ఎబ్బెట్టు కలిగించే రీతిలో వస్త్రధారణ లేకుండా చూసుకోవలసిన బాధ్యత ఎవరికి వారికే ఉండాలి. అయినా ఆలయ పూజారులు కూడా దేవాలయాలకు వచ్చేటప్పుడు పద్దతైన బట్టలు వేసుకొని రావాలంటూ రూల్సు కూడా పెట్టారు. అసలే రంజాన్ మాసం. ముస్లిం సోదర సోదరీమణులు ఎంతో భక్తి శ్రద్ధలతో అల్లాని ఆరాధించే పవిత్ర మాసం. ఈ మాసంలో స్నేహితులకు బంధువులకు ఇప్తార్ పేరుతో విందు ఏర్పాటు చేస్తుంటారు. కులమతాలకతీతంగా హాజరై ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు అందజేస్తారు. ఈ వేడుకకు హాజరైన బాలీవుడ్ నటి సోనాలీ రౌత్ ముస్లిం సాంప్రదాయానికి అతీతంగా డ్రెస్ చేసుకుని విందుకు హాజరైంది. కాంగ్రెస్ నేత బాబా సిద్ధికీ ఇచ్చే విందుకు హాజరైన బాలీవుడ్ సెలబ్రిటీల్లో ఆమె కూడా ఒకరు. ర్యాంప్ వాక్కు వెళుతున్నట్లుగా హాజరైన ఆమెను చూసి అతిధులు అవాక్కయ్యారు. సోషల్ మీడియాలో ఆమె ఫొటోలను చూసిన నెటిజన్స్ మతానికి గౌరవం ఇవ్వకపోయినా, కనీసం పండుగకైనా ప్రాధాన్యత ఇవ్వాల్సింది అని సోనాలీని విమర్శిస్తున్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ తాత్యాలిక అధ్యక్షుడిగా ముఖ్బీర్..?
- దుబాయ్ లో సైకిళ్లు, స్కూటర్ల కోసం మల్టీయూజ్ ట్రాక్
- సౌత్ అల్ బతినా గవర్నరేట్‌లో అగ్నిప్రమాదం
- కింగ్ సల్మాన్ కు వైద్య పరీక్షలు
- నకిలీ వర్క్ పర్మిట్లు సేల్..ఇద్దరు అరెస్ట్
- మారిటైమ్ సేఫ్టీ నినాదంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- ఇరాన్ అధ్యక్షుడు రైసీహెలికాప్టర్ ప్రమాదంలో మృతి..!
- యూఏఈ ప్రయాణ వ్యాక్సిన్లు: అవసరమైన జాబ్‌లు, ఖర్చులు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు