'టిక్ టిక్ టిక్' సెన్సార్ పూర్తి..
- June 12, 2018
ఇండియన్ సినిమా చరిత్రలో తొలి అంతరిక్ష సినిమాగా రాబోతున్న 'టిక్ టిక్ టిక్' విడుదలకు సిద్దమవుతోంది. విలక్షణమైన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించడంలో ముందుండే చదలవాడ బ్రదర్స్ 'టిక్ టిక్ టిక్' ను టాలీవుడ్ లోకి అనువదిస్తున్నారు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ బ్యానర్‌పై చదలవాడ పద్మావతి, చదలవాడ లక్ష్మణ్ నిర్మిస్తున్న ఈ సినిమాను జూన్ 22న విడుదల చేస్తున్నారు. అద్భుతమైన విజువల్స్, గ్రాఫిక్ వర్క్‌తో పాటు, థ్రిల్ కలిగించే సౌండ్ ఎఫెక్ట్‌తో టిక్ టిక్ టిక్ సిద్దమయింది. ఆడియెన్స్‌కి ఇదొక విజువల్ ఫీస్ట్. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకొని క్లీన్ 'యు' సర్టిఫికెట్ పొందింది.
ఈ సందర్భంగా చదలవాడ లక్ష్మణ్ మాట్లాడుతూ.. ''టిక్ టిక్ టిక్ సెన్సార్ పూర్తయింది. క్లీన్ యు సర్టిఫికెట్ లభించింది. అంతరిక్షం నేపథ్యంలో రూపొందిన తొలి ఇండియన్ మూవీ ఇది. సినిమా చూసే ప్రతి ప్రేక్షకుడు థ్రిల్ అయ్యేలా ఉంటుంది. ఓ కొత్త అనుభూతినిచ్చే సినిమా. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ మిలియన్ వ్యూస్‌ను రీచ్ అయింది. `బిచ్చగాడు`, డి16 సినిమాలను తెలుగులో విడుదల చేసినప్పుడు ఇక్కడి ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. వాటిని మించెలా తెరకెక్కిన విలక్షణమైన సబ్జెక్ట్ ఇది'' అన్నారు.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!