షార్జా:టబ్‌లో మునిగి బాలిక మృతి

షార్జా:టబ్‌లో మునిగి బాలిక మృతి

షార్జా:21 నెలల బాలిక, వాటర్‌ టబ్‌లో మునిగి ప్రాణాలు కోల్పోయిన ఘటన షార్జాలో చోటు చేసుకుంది. బాలికను హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఘటన గురించిన సమాచారం అందగానే సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు, బాలికను రక్షించేందుకు ప్రయత్నించారు, ఆమెను ఆసుపత్రికి తరలించారు. కాగా, ఘటనపై విచారణ జరిపిన పోలీసులు, ఘటన ఎలా జరిగిందన్నదానిపై ఆరా తీశారు. బాలిక తల్లిదండ్రులు, తమ బంధువుల ఇంటికి వచ్చిన సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కా చెల్లెళ్ళు బాత్‌ టబ్‌లో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తూ ఈ ఘటన జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. ఆసుపత్రికి తరలించే సమయానికే బాలిక మృతి చెందింది. నీటిని అధికంగా తాగేయడం వల్ల ఊపిరి ఆడక బాలిక మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు. తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో అప్రమత్తంగా వుండాలని పోలీసులు సూచించారు. 

 

Back to Top