అంతిమ ప్రయాణం ఎలా ఉంటుందో మరి...!!

- December 10, 2015 , by Maagulf

నేస్తం,
నీకొకటి తెలుసా... మన జీవితంలో మనం చూడలేనిది ఏమిటో... ఒక్క మనం తప్ప అందరు చూడగలరు అది.. ఈ ప్రపంచంతో బంధాలను వదిలించుకుని సాగే ప్రయాణం అదే అంతిమ యానం... ఘనంగా సాగనంపుతున్నారో... గతి లేనట్లుగా పంపేస్తున్నారో.. కూడా చూడలేనిది... తిడుతున్నారో... పొగుడుతున్నారో వినలేనిది.. ఈ ఆఖరి ప్రయాణమొక్కటే... మనం వెళిపోయినా ఇక్కడే ఉన్న మన జ్ఞాపకాలు సజీవాలుగా ఉండి పోతాయి ఎప్పటికి మన అనుకున్న వాళ్ళకు... మనం మాత్రం వెళిపోతూ ఏమి తీసుకెళ్ళకుండానే ఊపిరిని కూడా వదిలేస్తాం... కనీసం మరణం తరువాత ఏమిటో కూడా తెలియకుండానే మరణానికి చుట్టాలమైపోతాం మన ప్రమేయం లేకుండానే... అంతిమ ప్రయాణానికి అక్షరాలూ సహకరించలేమంటున్నాయి ఓడార్పుకు బాసటగా నిలుస్తూ... జీవితానికి చిట్ట చివరి మజిలీ మరణమని.... అప్పటి వరకు మనతో ఉన్నది ఏది మరణంలో మనతో రాదని తెలిసినా ఏదో తాపత్రయం బ్రతికినన్నాళ్ళు... అంతిమ ప్రయాణాన్ని చూడలేని మనకు అలవికాని కోరికలెన్నో.... కన్నీళ్ళ వీడ్కోలు చూడలేము... కదలిరాని బాంధవ్యాలను మనతో కాటికి రమ్మనలేము... అంతిమ ఘడియల్లో జీవాన్ని వదిలే జీవి అంతర్మధనాన్ని అర్ధం చేసుకునే భాష ఇంకా రాలేదేమో.. ఎన్నో మరణ ప్రయాణాలను చూసినా మనం చూడలేని మన అంతిమ ప్రయాణం ఎలా ఉంటుందో మరి...
మరణమంటూ లేని స్నేహాన్ని తోడుగా చేసుకున్న మన మధ్యలో దూరాన్ని పెంచే ఈ అంతిమ ఘడియలకు వీడ్కోలు పలకాలని కోరుకుంటూ ...
నీ స్నేహం ...

--మంజు యనమండ్ల 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com