యు.ఏ.ఈలో 51 డిగ్రీలకు చేరిన అత్యధిక ఉష్ణోగ్రత

యు.ఏ.ఈలో 51 డిగ్రీలకు చేరిన అత్యధిక ఉష్ణోగ్రత

యూఏఈలో అత్యధి ఉష్ణోగ్రత 51 డిగ్రీలకు చేరుకుంది. సైహ్‌ అల్‌ సలెమ్‌లో 51 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కాగా, దేశంలోని నాలుగు స్థానాల్లో 50 డిగ్రీలకు పైన ఉష్ణోగ్రతలు నమోదయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అత్యల్ప ఉష్ణోగ్రత 27.7గా నమోదయ్యింది. నేషనల్‌ సెంటర్‌ ఆఫ్‌ మిటియరాలజీ (ఎన్‌సిఎం) వెల్లడించిన వివరాల ప్రకారం, వాతావరణం రానున్న రోజుల్లో మరింత వేడిగా వుంటుందని తెలుస్తోంది. ఈస్ట్‌వార్డ్‌లో కొంతమేర మేఘాలు ఏర్పడే అవకాశం వుంది. సాధారణ నుంచి ఓ మోస్తరు వేగంతో గాలులు వీస్తాయి. పలు ప్రాంతాల్లో ధూళి ఎక్కువగా వుంటుంది. వేడికి సమాంతరంగా హ్యుమిడిటీ కొనసాగుతుంది. సముద్ర తీర ప్రాంతాలు సాధారణంగానే కనిపిస్తాయి. 

Back to Top