సలాలా టూరిజం ఫెస్టివల్ 2018 ప్రారంభం
- July 11, 2018
మస్కట్: సలాలా టూరిజం ఫెస్టివల్ 2018 యాక్టివిటీస్ ప్రారంభమయ్యాయి. సలాలా మునిసిపాలిటీ రిక్రియేషనల్ సెంటర్‌లో ఈ టూరిజం ఫెస్టివల్ సందర్శకుల్ని అలరిస్తోంది. ఖరీఫ్ సీజన్ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో టూరిస్టులు ఈ ఫెస్టివల్‌ని ఆస్వాదించనున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ టూరిజం వెల్లడించింది. జూన్ 21 నుంచి జులై 3 వరకు దోఫార్‌లో పర్యటించిన టూరిస్టుల సంఖ్య 52,017కి చేరుకుంది. గత ఏడాది ఇదే పీరియడ్‌లో 38,404 మంది టూరిస్టులు వచ్చారు. ఆ రకంగా చూస్తే ఈ ఏడాది 35.4 శాతం పెరుగుదల నమోదయ్యింది. సలాలాలో ప్రముఖ నగరమైన దోఫార్, ఖరీఫ్ సీజన్‌లో మరింత ఆకర్షణీయంగా మారుతుంది. యాన్యువల్ ఖరీఫ్ ఫశ్రీస్టివల్‌లో సంప్రదాయ ప్రదర్శనలు, స్థానిక హ్యాండిక్రాఫ్ట్స్‌ని విక్రయించే స్టాల్స్, ఒమనీ కలినరీ డిలైట్స్ ఈ ఫెస్టివల్‌లో ప్రధాన ఆకర్షణలు. ఈ ఫెస్టివల్ కోసం ఒమన్ మినిస్ట్రీ ఆఫ్ టూరిజం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసింది.
తాజా వార్తలు
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!







