మనామా:లిక్కర్‌ స్మగ్లర్స్‌ అప్పీల్‌ని తిరస్కరించిన న్యాయస్థానం

మనామా:లిక్కర్‌ స్మగ్లర్స్‌ అప్పీల్‌ని తిరస్కరించిన న్యాయస్థానం

మనామా:200,000 బహ్రెయినీ దినార్స్‌ విలువైన ఆల్కహాల్‌ని స్మగ్లింగ్‌ చేసిన కేసులో 14 మందికి జైలు శిక్ష విధించగా, వారి అప్పీల్‌ని న్యాయస్థానం తాజాగా తిరస్కరించింది. నిందితులంతా ఆసియా జాతీయులే. వీరికి ఆరు నెలల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. అనంతరం వారిని దేశం నుంచి బహిష్కరిస్తారు. ఈ కేసుకి సంబంధించి మొత్తం 21 మంది అనుమానితులపై కేసులు నమోదయ్యాయి. వీరిలో ఏడుగురికి మూడు నెలల జైలు శిక్ష పడగా, వీరెవరూ తమ శిక్షను అప్పీల్‌ చేయడానికి ముందుకు రాలేదు. షిప్‌లో అక్రమంగా మద్యం బాటిళ్ళను దాచి, బహ్రెయిన్‌లోకి స్మగుల్‌ చేస్తుండగా నిందితుల్ని అరెస్ట్‌ చేశారు. వారి నుంచి 200,000 బహ్రెయినీ దినార్స్‌ విలువైన మద్యంతోపాటుగా, 36,000 బహ్రెయినీ దినార్స్‌ కరెన్సీని కూడా స్వాధీనం చేసుకున్నారు.

Back to Top