చింత గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు...
- August 20, 2018మనం ప్రతిరోజు వంటలలో చింతపండు వాడుతూ ఉంటాము. కేవలం చింతపండు వలన మాత్రమే కాకుండా చింత గింజల వలన కూడా చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏమిటంటే... వయసు పెరగడం, అధిక బరువు వంటి కారణాల వల్ల మోకాలిలో కీళ్లు అరిగిపోయి మోకాలి నొప్పి కలుగుతుంది. దీనిని తగ్గించటానికి చింతగింజల పొడి అద్భుతంగా పనిచేస్తుంది. చింతగింజలను తీసుకొని పుచ్చులు లేకుండా బాగా శుభ్రపరచుకోవాలి. వీటిని బాగా వేయించిన తర్వాత మంచి నీటిలో రెండు రోజులపాటు నానబెట్టాలి. ప్రతిరోజు రెండు పూటలా నీటిని మారుస్తుండాలి.
ఇలా నానిన చింతగింజలను పొట్టు తీసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పొడిని గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. చింత గింజల పొడిని రోజుకు రెండుసార్లు అర టీ స్పూన్ చొప్పున పాలు లేదా నీటితో నెయ్యి లేక చక్కెర కలిపి తీసుకోవాలి. ఇలా చేస్తే రెండుమూడు నెలల్లో మంచి ఫలితం కనిపిస్తుంది. మోకాలి నొప్పి పూర్తిగా తగ్గుతుంది. చింతగింజల చూర్ణం కీళ్ల నొప్పులకే కాక డయేరియా, డయాబెటిస్, గొంతులో ఇన్ఫెక్షన్లు ఇంకా దంత సమస్యలను తగ్గించటంలో సహాయపడుతుంది.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం