ఇండియా:స్వల్ప జోరందుకున్న రూపాయి
- August 20, 2018
ముంబయి:అంతర్జాతీయ వాణిజ్య భయాలు, టర్కీ లీరా పతనంతో జీవనకాల కనిష్ఠానికి చేరుకున్న రూపాయి ఎట్టకేలకు కోలుకుంది. డాలరుతో రూపాయి విలువ సోమవారం 33 పైసలు కోలుకుని 69.82కి చేరింది. ఒక్కరోజులో ఈ స్థాయిలో రూపాయి విలువ పెరగడం ఏడు వారాల్లో ఇదే గరిష్ఠం. అంతర్జాతీయ పరిణామాలకు తోడు వాణిజ్య చర్చలు జరిపేందుకు చైనా ప్రతినిధులు అమెరికాకు వెళ్తారన్న సంకేతాలు రూపాయి బలపడడానికి కారణమయ్యాయి. దీనికి తోడు ద్రవ్యోల్బణం తగ్గడం మరో కారణం. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో గత వారంలో రూపాయి విలువ భారీగా పతనమైన సంగతి తెలిసిందే. టర్కీ ప్రభావంతో జీవన కాల కనిష్ఠమైన రూ.70.40కు చేరుకుంది.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







