కొబ్బరితో మధుమేహానికి చెక్ పెట్టవచ్చు...
- September 04, 2018కొబ్బరిలోని ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం. కొబ్బరిని తరచుగా తీసుకుంటే థైరాయిడ్ వ్యాధులు దరిచేరవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుటకు కొబ్బరి చాలా ఉపయోగపడుతుంది. కిడ్నీ వ్యాధులు, బరువు తగ్గడం వంటి సమస్యల నుండి కాపాడుతుంది. ప్రతిరోజూ కొబ్బరి తరచుగా తీసుకోవడం వలన పొట్టచూట్టూ చేరిన ప్రమాదకర ఫ్యాట్‌ను తగ్గిస్తుంది.
ఈ కొబ్బరిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. తద్వారా మధుమేహా వ్యాధిని అదుపులో ఉంచుతుంది. శరీరంలోని వ్యర్థ పదార్థాలను తొలగిస్తుంది. పాల కన్నా కొబ్బరి నీళ్లల్లో పోషక విలువలు పుష్కలంగా ఉన్నాయి. ఎసిడిటీ, గుండె మంటను తగ్గిస్తుంది. కొబ్బరి తీసుకోవడం వలన చర్మంలో ఆక్సిజన్ పాళ్లు పెరిగి రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది.
జిడ్డు చర్మానికి కొబ్బరి నీళ్లు చక్కగా పనిచేస్తాయి. చర్మంలోని అదనపు ఆయిల్స్‌ను తొలగించి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కొబ్బరిలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు తలలో చుండ్రు, పేలు చేరడం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.
తాజా వార్తలు
- ఏపీలో భానుడి విశ్వరూపం, బెంబేలెత్తిపోతున్న జనం
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!
- సలాలా ఆటిజం సెంటర్.. ఆటిస్టిక్ పిల్లలకు వరం..!
- కాలువల్లో చనిపోయిన చేపలు.. మున్సిపాలిటీ క్లారిటీ
- యాంటీబయాటిక్స్ నిల్..పుకార్లను నమ్మొద్దు
- 15 ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు.. అలర్ట్ జారీ
- 'రామాయణం' షూటింగ్ సెట్ నుంచి రణబీర్ కపూర్, సాయి పల్లవి ఫోటోలు లీక్..
- ముంబైలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం