తమిళ్ నటుడి భార్య ఆత్మహత్య
- September 04, 2018చెన్నై: పిల్లలు పుట్టలేదని మనస్తాపం చెంది నటుడి భార్య ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. మధురవాయిల్‌లో సిద్ధార్థ్ అనే సహాయ నటుడు నివశిస్తున్నాడు. ఇతను ఆది హీరోగా నటించిన యాగవరాయనుమ్, నాకాక్క చిత్రాల్లో సహాయ నటుడిగా నటించాడు. సిద్ధార్థ్ భార్య స్మిరిజ. వీరికి వివాహమై మూడేళ్లు అయ్యింది. ఇంకా పిల్లలు పుట్టలేదు. ఈ విషయమై దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఇదిలాఉండగా సోమవారం రాత్రి సిద్ధార్థ్ భార్యతో కలిసి హోటల్‌కు వెళ్లి భోజనం చేసి ఇంటికి వచ్చారు.
అనంతరం దంపతులు గొడవపడినట్లు తెలుస్తోంది. దీంతో స్మిరిజా కోపంగా గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంది. సిద్ధార్థ్ హాలులోనే పడుకున్నాడు. ఉదయం నిద్రలేచిన సిద్ధార్థ్ 8.30 గంటలు అవుతున్నా భార్య గది నుంచి బయటకు రాకపోవడంతో తలుపు తట్టి పిలిచాడు. ఎలాంటి స్పందన లేకపోవడంతో అనుమానం వచ్చి వెంటనే మధురవాయిల్ పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు వచ్చి తలుపులు బద్దలుకొట్టి లోనికి వెళ్లి చూడగా స్మిరిజా ఫ్యాన్‌కు ఉరివేసుకుని శవంగా వేలాడుతోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్మిరిజా మృతదేహాన్ని శవపరిక్ష కోసం కీల్పాక్కం ఆస్పత్రికి తరలించారు. కేసు విచారణ జరుపుతున్నారు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం