దుబాయ్‌ డ్యూటీ రాఫెల్ 1 మిలియన్‌ డాలర్స్‌ గెల్చుకున్న వలసదారులు

దుబాయ్‌ డ్యూటీ రాఫెల్ 1 మిలియన్‌ డాలర్స్‌ గెల్చుకున్న వలసదారులు

ఓ కంపెనీలో పనిచేస్తోన్న 10 మంది కొలీగ్స్‌ 1 మిలియన్ డాలర్‌ బహుమతిని దుబాయ్‌ డ్యూటీ ఫ్రీ రాఫెల్ లో గెల్చుకున్నారు. భారతీయుడైన 38 ఏళ్ళ గుర్మీత్‌ సింగ్‌, 1197 టిక్కెట్‌ని 280 సిరీస్‌లో కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఆయన షోరూమ్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. తన సహచరులు తొమ్మిది మందితో కలిసి టిక్కెట్‌ని కొనుగోలు చేసిన గుర్మీత్‌, దుబాయ్‌ రాఫెల్ లో విజేతగా నిలిచారు. ఆయన టీమ్‌లో పలువురు ఇండియన్స్‌, బంగ్లాదేశీ మరియు ఫిలిప్పినోస్‌ వున్నారు. లెబనాన్‌కి చెందిన లబాకీ మరో విజేతగా నిలిచారు. ఆయన బిఎండబ్ల్యు 745 ఎల్‌ఐ కారుని 2004లో గెల్చుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులకు విజేతలు కృతజ్ఞతలు తెలిపారు. 

Back to Top