రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..
- April 25, 2024
హైదరాబాద్: రేపు నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ రేపు రాష్ట్రానికి రానున్నారు. ఆయన పర్యటనకు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు సీఎస్ శాంతికుమారి ఇప్పటికే అధికారులను ఆదేశించారు.
వివిధ విభాగాల అధికారులు సమన్వయంతో పని తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. పటిష్ఠమైన భద్రత, ట్రాఫిక్, బందోబస్తు, వైద్య సౌకర్యాలు కల్పించడంతో పాటు రోడ్ల మరమ్మతులు చేపట్టారు. ఇంతకీ ఆయన ఎక్కడికి రానున్నారంటే..
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ శంషాబాద్ విమానాశ్రయానికి సమీపంలోని కన్హా శాంతివనాన్ని సందర్శించనున్నారు. ఈ సందర్భంగా శంషాబాద్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నందిగామ పరిసరాల్లో నేడు, రేపు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం 6 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. నందిగామ పరిసరాల్లో ఆంక్షలు విధించనున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చే ట్రాఫిక్‌ను గొల్లపల్లి టోల్‌గేట్ వయా పెద్దగోల్కొండ మీదుగా ఇండియన్ బేకరీ(తొండుపల్లి), బుర్జుగడ్డ వద్ద యూటర్న్ తీసుకొని ముచ్చింతల్, మన్‌సాన్‌పల్లి ఎక్స్‌రోడ్డు, అమీర్‌పేట్, తిమ్మాపూర్, షాద్‌నగర్ మీదుగా మళ్లిస్తారు. అలాగే, గచ్చిబౌలి నుంచి వచ్చే ట్రాఫిక్‌ను పెద్దగోల్కొండ టోల్‌గేట్, మన్‌సాన్‌పల్లి ఎక్స్‌రోడ్డు, అమీర్‌పేట్, తిమ్మాపూర్, షాద్‌నగర్ మీదుగా మళ్లీంచనున్నారు. షాద్‌నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో షాద్‌నగర్ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే ట్రాఫిక్‌తోపాటు పెంజర్ల ఎక్స్‌రోడ్డు నుంచి వచ్చే ట్రాఫిక్‌ను అమీర్‌పేట్ మన్‌సాన్‌పల్లి ఎక్స్‌రోడ్డు నుంచి పెద్దగోల్కొండ టోల్‌గేట్, శంషాబాద్, హైదరాబాద్ వైపు మళ్లిస్తారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా గమ్యస్థానాలకు చేరుకోవాలని, ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని పోలీసులు సూచించారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







