అబార్షన్‌ కిరాయి హత్యతో సమానం: పోప్ ఫ్రాన్సిస్‌

అబార్షన్‌ కిరాయి హత్యతో సమానం: పోప్ ఫ్రాన్సిస్‌

అబార్షన్‌ (గర్భవిచ్చిత్తి)పై పోప్‌ ఫ్రాన్సిస్‌ కీలక వ్యాఖ్యలు చేసారు. బుధవారం వాటికన్‌ సిటీలో ప్రార్థనల సందర్భంగా భక్తులనుద్దేశించి మాట్లాడుతూ 'అబార్షన్‌ అంటే కిరాయి హత్యతో సమానం. యుద్ధాలు, స్వార్ధంతో చేసే దారుణాలు, అబార్షన్లు ఇలాంటివన్నీ ఒకే తరహాకు చెందినవి. అభంశుభం తెలియని ఓ పసి ప్రాణాన్ని చంపేస్తున్న అబార్షన్‌ను శాస్త్రీయమైన విధానంగా ఎలా చెప్పగలం? ఏ ప్రాతిపదికన సమాజంలో, మానవీయతలో అబార్షన్‌కు చోటివ్వగలం?' అని ప్రశ్నించారు. అర్జెంటీనాలో అబార్షన్‌ను చట్టబద్ధంచేస్తూ తెస్తున్న బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు.

 

 
 

Back to Top