'గేమ్ ఓవర్' లో తాప్సీ

'గేమ్ ఓవర్' లో తాప్సీ

ఉత్తరాది, దక్షిణాది చిత్రాల్లో తనకంటూ గుర్తింపు సంపాదించుకున్న నేటి తరం హీరోయిన్స్‌లో తాప్సీ ఒకరు. స్క్రిప్ట్స్ సెలక్షన్ విషయంలో అచితూచి అడుగులు వేస్తున్న తాప్సీ ఒక పక్క బాలీవుడ్‌తో పాటు సౌత్ సినిమాలను బ్యాలెన్స్‌డ్‌గా చేస్తుంది. ఇప్పుడు తాప్సీ ప్రధాన పాత్రలో నేటి నుండి కొత్త చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి 'గేమ్ ఓవర్' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. వీల్ చెయిర్‌లో తాప్సీ కూర్చున్న ఫోటోను విడుదల చేశారు. థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కనున్న చిత్రమిది. గతంలో నయనతారతో `మాయ` (తెలుగులో మయూరి) అనే హారర్ థ్రిల్లర్‌ను తెరకెక్కించిన దర్శకుడు అశ్విన్ శరవణన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. వై నాట్ స్టూడియోస్‌, రిలయన్స్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్స్ అసోసియేషన్‌తో శశికాంత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Back to Top