సూయజ్ రాకెట్‌కు ప్రమాదం.. ఇద్దరు ఆస్ట్రోనాట్లకు తప్పిన ముప్పు

సూయజ్ రాకెట్‌కు ప్రమాదం.. ఇద్దరు ఆస్ట్రోనాట్లకు తప్పిన ముప్పు

న్యూయార్క్: ఇద్దరు ఆస్ట్రోనాట్లను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్తున్న రష్యాకు చెందిన సూయజ్ రాకెట్ మధ్యలోనే చెడిపోవడంతో కజక్‌స్థాన్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఈ ప్రమాదం నుంచి ఇద్దరు ఆస్ట్రోనాట్లు సురక్షితంగా బయటపడ్డారు. రష్యాకు చెందిన కాస్మోనాట్ అలెక్సీ ఓవ్‌చినిన్, అమెరికా ఆస్ట్రోనాట్ నిక్ హేగ్ ప్రమాదంలో జరిగిన సమయంలో అందులో ఉన్నారు. ప్రస్తుతం వాళ్లు ల్యాండైన ప్రదేశానికి రెస్క్యూ టీమ్స్ వెళ్తున్నాయి. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు వెళ్లడానికి బయలు దేరిన ఈ రాకెట్ బూస్టర్‌లో సమస్య తలెత్తింది. దీంతో ఆ ఇద్దరు సిబ్బంది బాలిస్టిక్ డీసెంట్ మోడ్‌లో తిరిగి భూమిపైకి వచ్చినట్లు నాసా ట్వీట్ చేసింది. సాధారణ ల్యాండింగ్ కంటే ఇది కాస్త వేగంగా జరిగే ల్యాండింగ్ అని నాసా వెల్లడించింది. సూయజ్ రాకెట్‌లో ఆరు గంటల పాటు ప్రయాణించి ఐఎస్‌ఎస్‌కు చేరాల్సి ఉంది. వీళ్లు ఆరు నెలల పాటు స్పేస్ స్టేషన్‌లో ఉండాల్సి ఉంది.

Back to Top