గోరు వెచ్చని నీళ్లు.. గుండెకు పదిలం..

- October 18, 2018 , by Maagulf
గోరు వెచ్చని నీళ్లు.. గుండెకు పదిలం..

గుప్పెండంత గుండె ఆరోగ్యంగా ఉంటేనే మనిషి మనుగడ సాగించేది. నిరంతరాయంగా పని చేస్తున్న గుండె ఓ క్షణకాలమైనా అలసి పోయిందంటే ఊపిరి ఆగిపోతుంది. మరి అలాంటి గుండెని పదికాలాల పాటు పదిలంగా ఉంచుకోవాలంటే కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు కూడా పాటించాలి. మంచి ఆహారంతో పాటు, వ్యాయామం, గోరు వెచ్చటి నీటితో స్నానం లాంటివి పాటిస్తే మంచిది. రెండుపూటలా గోరు వెచ్చటి నీరు శరీరం మీద పడితే శారీరక అలసటతో పాటు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. గుండెకు రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది. రక్తపోటు (బీపీ) అదుపులో ఉంటుంది.
జపాన్ పరిశోధకులు సుమారు ఎనిమిదివందలమంది స్త్రీ పురుషుల మీద అధ్యయనం చేసి ఈ విషయాన్ని వెల్లడించారు. కొన్ని నెలల పాటు గోరువెచ్చని నీటితో స్నానం చేసే వారి గుండె ఆరోగ్యంగా ఉన్నట్లు గుర్తించారు. స్నానానికి ఉపయోగించే నీరు చన్నీళ్లకంటే గోరువెచ్చనీళ్లయితే గుండె పనితీరు మెరుగ్గా ఉంటుందని చెబుతున్నారు. సో.. ఈరోజునుంచే పాటించేస్తే గుప్పెండంత గుండె భద్రం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com