పోస్టుమార్టం కోసం కూతురు మృతదేహంతో 8కిమీ.. నడిచిన తండ్రి

- October 18, 2018 , by Maagulf
పోస్టుమార్టం కోసం కూతురు మృతదేహంతో 8కిమీ.. నడిచిన తండ్రి

ఒడిశా:ఒడిశాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. వాహనానికి డబ్బులు లేక పోస్టుమార్టం కోసం కన్న కూతురి మృతదేహాన్ని 8 కిలోమీటర్ల మోసుకెళ్లాడు ఓ వ్యక్తి. ఈ ఘటన ఒడిశాలోని గజపతి జిల్లాలో చోటుచేసుకుంది. ఇటీవల తితలీ తుఫాన్ గజపతి జిల్లాను తీవ్రంగా కుదిపేసింది. తుఫాను దాటికి సర్వం కోల్పోయిన వారిలో అతంక్‌పూర్‌ గ్రామానికి చెందిన ముకుంద్ కుటుంబం కూడా ఒకటి. ఉండే ఇల్లు కూలిపోయింది, నాలుగు రోజులుగా ఆహరం లేదు. ఇదిలావుంటే గత ఆదివారం ముకుంద్ తన పదకొండేళ్ల కూతురు బబిత కనిపించకుండా పోయింది. ఆమె ఊరు శివారులో కొండచరియలు విరిగిపడి చనిపోయిందని తెలిసింది. దాంతో వరద కష్టాల్లో ఉన్న ముకుంద్ కుటుంబం మరింత విషాదంలో మునిగిపోయింది. బబిత మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం చెయ్యడం కోసం ఆసుపత్రికి తీసుకురావాలని తండ్రికి సూచించారు. అసలే ఆర్ధిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన ముకుంద్.. వాహనానికి డబ్బులు లేక కూతురు మృతదేహాన్ని 8 కిలోమీటర్లు మోసుకెళ్లాడు. ఇంతలో సమీప గ్రామ ప్రజలు విచారించగా వాహనం సమకూర్చుకోవడానికి తన దగ్గర డబ్బులు లేకపోవడంతో.. ఇలా రావలసి వచ్చిందని సమాధానం చెప్పాడు. దాంతో చలించిపోయిన గ్రామస్థులు కొందరు.. వెంటనే వాహానం ఏర్పాటు చేసి హాస్పిటల్ కు తరలించారు. కాగా బబిత ఘటనపై విమర్శలు రావడంతో అధికారులు విచారణకు ఆదేశించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com