నిఖిల్..నివేద..'శ్వాస'
- October 18, 2018హైదరాబాద్: యువ కథానాయకుడు నిఖిల్, నివేదా థామస్ జంటగా ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. కిషన్ కట్టా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. ఈ చిత్రానికి 'శ్వాస' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. విజయదశమిని పురస్కరించుకుని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈరోజు పూజా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని చిత్ర వర్గాలు సోషల్‌మీడియా ద్వారా వెల్లడిస్తూ టైటిల్ పోస్టర్‌ను విడుదల చేశాయి. పోస్టర్లో నిఖిల్, నివేదా ఓ రహదారిపై నడుచుకుంటూ వెళుతున్నట్లు కన్పించారు. నిఖిల్ ఆకాశం వైపు టార్చ్‌లైట్‌ను చూపిస్తున్నట్లుగా ఉన్న ఈ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
తేజ్ ఉప్పలపాటి, హరిణికేశ్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిఖిల్ 'ముద్ర' అనే మరో చిత్రంతోనూ బిజీగా ఉన్నారు. సంతోష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 2016లో వచ్చిన 'కణిథన్' అనే తమిళ చిత్రానికి ఇది రీమేక్‌గా రాబోతోంది. ఇందులో నిఖిల్‌కు జోడీగా లావణ్య త్రిపాఠి నటిస్తున్నారు. నిఖిల్ విలేకరి పాత్రను పోషిస్తున్నారు. మరోపక్క నివేదా..కల్యాణ్ రామ్‌కు జోడీగా ఓ చిత్రంలో నటిస్తున్నారు. దీనిలో షాలిని పాండే మరో కథానాయికగా కన్పించనున్నారు.
తాజా వార్తలు
- పాకిస్థాన్‌లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్‌కు గూగుల్ చెక్