జీవితంలో చేయడనుకున్న పని చేసేసిన RGV
- October 19, 2018
సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన జీవితంలో చేయడనుకున్న పని చేసేశాడు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు డైరెక్టర్ రాంగోపాల్‌వర్మ. తాను నాస్తికుడిని అంటూనే…… వెంకన్నను దర్శించడం విశేషం. ఈ సాయంత్రం 4 గంటలకు తిరుపతిలో.. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా వివరాలను చెప్పనున్నారు వర్మ. అసలు…. వివాదాల వర్మ బాలాజీ దర్శనానికి….. ఎందుకు వెళ్లాడనేది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. పబ్లిసిటీ కోసం వర్మ….. దేవుడిని కూడా వాడేసుకుంటున్నాడా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. నిన్న కాణిపాకం దర్శించుకున్న ఆర్జీవీ ఇవాళ తిరుమల దర్శనం వెనుక…. పబ్లిసిటీ లెక్కలున్నట్లు తెలుస్తోంది.
దేవుడంటేనే ఆమడం దూరం ఉండే.. వర్మ …. దసరా వేళ అందర్నీ ఆశ్చర్యపర్చుతూ కాణిపాకం వినాయకుడిని దర్శించుకున్నారు. సిబ్బంది ఆయనకు పూలమాలలు వేసి ఆహ్వానం పలకగా.. వర్మ పూజలు చేశారు. వేదపండితులు మంత్రోచ్ఛరణలతో వర్మ కుటుంబ సభ్యులను ఆశీర్వదించారు. ఆలయ నిర్వాహకులు వినాయకుడి చిత్రపటం, ప్రసాదం అందజేశారు. అనంతరం సాధారణ భక్తుల తరహాలోనే ఆలయంలో కలియతిరుగుతూ వర్మ దైవదర్శనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







