ఈ నెల 20న రాహుల్ టూర్‌లో స్వల్పమార్పు
- October 18, 2018
ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ….. తెలంగాణ టూర్‌లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా రేపు, 27 తేదీల్లో రాహుల్ తెలంగాణలో పర్యటించనున్నారు. అయితే… రేపటి పర్యటనకు సంబంధించి టీపీసీసీ ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది. కానీ తాజాగా రాహుల్ పర్యటనలో స్వల్ప మార్పులు చేసింది..
తాజా షెడ్యూల్ ప్రకారం.. రాహుల్ నాందేడ్ నుంచి ముందుగా బైంసాకు చేరకుంటారు. మధ్యాహ్నం 12.30 నుంచి 1.30 గంటల వరకు బైంసాలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం…. 2.30 నుంచి 3.30 గంటల వరకు కామారెడ్డి బహిరంగ సభలో ప్రసగింస్తారు. ఆ తర్వాత .అక్కడి నుంచి హైదరాబాద్ చేరుకుని.. చార్మినార్ వద్ద సాయంత్రం జరిగే రాజీవ్ సద్భావన దినోత్సవంలో పాల్గొంటారు. తర్వాత రాత్రి 7 గంటలకు రాహుల్ తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు.
రాహుల్ పర్యటనతో తెలంగాణలో పార్టీ ప్రచారానికి ఊపు వచ్చే విధంగా సభలను నిర్వహించాలని టీపీసీసీ యోచిస్తోంది. కాగా తొలుత నిర్ణయించిన షెడ్యూల్ మేరకు రాహుల్ రేపు ఉదయం చార్మినార్ వద్ద రాజీవ్ సద్భావన దినోత్సవంలో పాల్గొనాల్సి ఉంది. కానీ ఈ షెడ్యూల్‌ను మార్చేశారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







