బ్యాడ్ వెదర్: యూఏఈ రోడ్స్‌పై స్పీడ్స్ లిమిట్స్ తగ్గింపు
- November 07, 2018ట్రాఫిక్ సేఫ్టీ కమిటీ, అబుదాబీ రోడ్లు అలాగే హైవేస్‌పై స్పీడ్ లిమిట్‌ని తగ్గించేలా స్మార్ట్ ఇంటెలిజెంట్ సిస్టమ్‌ని ఇంప్లిమెంట్ చేస్తున్నట్లు ప్రకటించింది. వాతావరణంలో మార్పుల కారణంగా, విజిబిలిటీ తగ్గినందున స్పీడ్ లిమిట్స్ తగ్గిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. విజిబిలిటీ 200 మీటర్ల కంటే తగ్గినప్పుడు, రోడ్లపై స్పీడ్ లిమిట్ గంటకు 80 కిలోమీటర్లకు తగ్గించబడ్తుంది. ప్రమాదాలు జరిగే అవకాశం వున్నందు, భద్రతను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ - అబుదాబీ ఈ విషయాన్ని వెల్లడించింది. మార్పు చేసిన స్పీడ్ లిమిట్స్, షేక్ రషీద్ బిన్ సయీద్ స్ట్రీట్, షేక్ ఖలీఫా స్ట్రీట్‌పై వున్న స్మార్ట్ టవర్స్ ద్వారా తెలుసుకోవచ్చు. అన్ని వాహనాలూ, ప్రకటించిన స్పీడ్ లిమిట్స్‌ని పాటించాల్సి వుంటుంది. విజిబిలిటీ సాధరణ స్థాయికి వచ్చేవరకు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ