హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- May 19, 2024
విశాఖపట్నం: విశాఖ పోలీసులు హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేశారు. విదేశాల్లో ఉద్యోగాల పేరిట కంబోడియా దేశానికి మానవ అక్రమ రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. అలాగే, కంబోడియా, మయన్మార్, బ్యాంకాక్ దేశాలకి భారత్ నుంచి ఉద్యోగాల పేరిట హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు నిందితులు.
విశాఖ సీపీ రవి శంకర్ మాట్లాడారు. డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరుతో ఏపీ నుంచి 150 మందిని హ్యూమన్ ట్రాఫికింగ్ చేశారని చెప్పారు. మొత్తం దాదాపు 5 వేల మంది వివిధ దేశాల్లో యువత వారి చేతిలో ఉన్నారని తెలిపారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశామని చెప్పారు. ఫెడ్ ఎక్స్, టాస్క్ గేమ్ పేరిట సైబర్ నేరాలు చెయ్యడంలో ఈ అమాయకులని వాడుకుంటున్నారని తెలిపారు.
ఇక్కడ నుంచి కంబోడియాకి వీరిని హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారని, నిరుద్యోగుల వద్ద నుంచి లక్షన్నర వరకు వసూలు చేశారని చెప్పారు. 80 వేల రూపాయలను కంబోడియా దేశంలో ఏజెంట్ కి ఇస్తారని తెలిపారు. ఆన్ లైన్ స్కాంలు చేయాలని వీరికి ట్రైనింగ్ ఇస్తున్నారని చెప్పారు.
అన్నం పెట్టకుండా కూడా ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. రాజేశ్ వినయ్ కుమార్ పేరిట చీఫ్ ఏజెంట్ ఉన్నాడని చెప్పారు. చైనాకి ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ కి లింక్స్ ఉన్నాయని తెలిపారు. ఈ స్కాంలో హనీ ట్రాప్ కూడా ఉందని, అమ్మాయిలను నగ్నంగా కూడా చూపిస్తున్నారని చెప్పారు.
తాజా వార్తలు
- తెలంగాణలో ₹1,000 కోట్ల స్టార్టప్ ఫండ్ ప్రకటించిన సీఎం రేవంత్
- తిరుమలలో మరో స్కామ్: నకిలీ పట్టు దుపట్టా మోసం
- మాలికి ట్రావెల్ బ్యాన్..వెంటనే తిరిగిరండి..!!
- ఒమన్ లో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం..!!
- దర్బ్ అల్ సయ్ లో నేషనల్ డే కార్యకలాపాలు..!!
- సౌదీ అరేబియాలో సీజనల్ రెయిన్ ఫాల్..!!
- మనమా సౌక్.. మనమా ఆత్మ, హార్ట్ బీట్..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డు షిప్ సర్థాక్..!!
- ఎన్నికల తేదీల కోసం జనాల ఎదురు చూపులు: కేటీఆర్
- దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!







