ఉద్యోగులకు గుడ్ న్యూస్..!

ఉద్యోగులకు గుడ్ న్యూస్..!

దేశవ్యాప్తంగా ఉన్న ఉద్యోగ వర్గాన్ని మచ్చిక చేసుకునే వ్యూహాలు రచిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఆకట్టుకునే ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగానే ఓ కొత్త అంశాన్ని తెరపైకి తీసుకు వచ్చింది. సాధారణంగా ప్రభుత్వ సంస్థల్లో కానీ ప్రయివేటు సంస్థల్లో కానీ పని చేసే ఉద్యోగులకు ప్రతి ఐదేళ్లకొకసారి నిర్దేశిత భత్యాన్ని గ్రాట్యుటీగా పొందే అవకాశం ఉండేది ఇప్పటి వరకు.

అయితే ఈ అవకాశం సంస్థలు ఉద్యోగులందరికీ కల్పించడం లేదన్నది వాస్తవం. సుదీర్ఘకాలం సర్వీసులో ఉన్నవారికి మాత్రమే లబ్ది చేకూరుతున్నదని ఉద్యోగ సంఘాలనుంచి నిరసన వ్యక్తమవుతోంది. అయితే ఇదే అవకాశంగా భావించిన మోదీ సర్కార్.. గ్రాట్యుటీ పీరియడ్‌ని మూడేళ్లకు కుదించేలా.. పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ-1972 చట్టాన్ని సవరించడానికి ప్రయత్నిస్తోంది. కాంట్రాక్ట్ బేస్‌లో తీసుకున్న ఉద్యోగులకు కూడా ఈ తాజా సడలింపు వర్తించే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి పారిశ్రామిక వర్గాల నుంచి సూచనలు, సలహాలను స్వీకరిస్తోంది లేబర్ మినిస్ట్రీ. డిసెంబర్ నెలాఖరుకు ఈ నిర్ణయం పట్ల స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Back to Top