గాజా కాల్పుల విరమణ ఒప్పందానికి నిరసన..ఇజ్రాయిల్ రక్షణ మంత్రి రాజీనామా
- November 14, 2018జెరూసలేం : గాజా కాల్పుల విరమణ ఒప్పందానికి నిరసనగా ఇజ్రాయిల్ రక్షణ మంత్రి అవిగ్డార్ లైబర్మన్ బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. 'భయానికి లొంగిపోవడం' గా ఈ ఒప్పందాన్ని ఆయన అభివర్ణించారు. ఈ చర్య ప్రధాని నెతన్యాహు ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. 'నేను అధికారంలో వుంటే దక్షిణ ప్రాంత ప్రజలు పడే ఇబ్బందులను చూడలేను.' అని ఆయన విలేకర్లతో వ్యాఖ్యానించారు. పాలస్తీనా రాకెట్ దాడులను ఎదుర్కొంటున్న ఇజ్రాయిలీలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. నెతన్యాహుకు లాంఛనప్రాయంగా రాజీనామా లేఖను అందచేశానని, 48గంటల్లోగా అమల్లోకి వస్తుందని చెప్పారు. నెతన్యాహు సంకీర్ణ ప్రభుత్వం నుండి ఆయన పార్టీ కూడా వైదొలగింది. వచ్చే ఏడాది ఇజ్రాయిల్ సార్వత్రిక ఎన్నికలు జరగనున్న తరుణంలో 120సీట్లు గల పార్లమెంట్లో నెతన్యాహు బలం కేవలం 61కి పడిపోయింది. తాజా పరిణామాల నేపథ్యంలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాలను నెతన్యాహు పార్టీ తోసిపుచ్చింది.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్‌లుగా యూఏఈ ల్యాండ్‌మార్క్‌లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్‌లో నిందితుడి అరెస్ట్