గూగుల్ మ్యాప్స్‌లో ఆకర్షణీయమైన ఫీచర్

- November 15, 2018 , by Maagulf
గూగుల్ మ్యాప్స్‌లో ఆకర్షణీయమైన ఫీచర్

కాలిఫోర్నియా: ఇప్పటిదాకా గూగుల్ మ్యాప్స్‌ను దారి చూపించే మార్గదర్శిగానే ఉపయోగిస్తున్నాం. దీనికి అదనంగా మరోకొత్త ఫీచర్‌ను గూగుల్ కలిపింది. ఇకపై రెస్టారెంట్‌కు దారితోపాటు అక్కడ ఉన్న మేనేజర్‌తో మాట్లాడి టేబుల్ బుక్ చేసుకొనే సౌకర్యాన్ని కూడా గూగుల్ కల్పిస్తోంది. 

గూగుల్ తన బ్లాగు ద్వారా ఈ విషయాన్ని తెలియచేస్తూ.. మ్యాపులతో పాటు బిజినెస్ వినియోగదారులు తమకు కావాల్సిన, అవసరమైన ఇతర వ్యాపారస్తుల వివరాలు సైతం గూగుల్ మ్యాపులో దర్శనమిస్తాయి. ఉదాహరణకు మనం వెళ్లే హోటల్ వివరాలు.. అక్కడి యాజమాన్య సిబ్బందితో మాట్లాడే వీలు కల్పిస్తుంది. ఈ సౌకర్యం యాండ్రయిడ్, ఐఓఎస్ ఫోన్ వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. అయితే స్థానికి వ్యాపారులు గూగుల్ మ్యాప్స్‌లో తమ కంపెనీ వివరాలు ఇతరులకు అందుబాటులో ఉంచేందుకు ఆ ఫీచర్‌ను ఎనేబుల్‌లో ఉంచుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేస్తారో... వారికి వారి బిజినెస్ ప్రోఫైల్స్‌లో ఒక మెసేజీ బటన్ గూగుల్ సెర్చ్‌లో అలాగే మ్యాప్స్‌లో కూడా కనిపిస్తుంది. దానిలో ఇతర బిజినెస్ సంస్థల అడ్రస్, చాట్ చేసేందుకు వివరాలు కనిపిస్తాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com