హలో నాని.. హూఈజ్ నాని..!
- November 15, 2018సినిమాల్లో హీరోల డ్యూయల్ రోల్స్ చాలానే చూస్తుంటాం.. సాధారణంగా డ్యూయల్ రోల్ అంటే తండ్రి కొడుకులుగానే నటిస్తుంటారు హీరోలు. కానీ నిజజీవితంలో హీరో, తన కొడుకు సేమ్ టూ సేమ్ ఉంటే ఎలా ఉంటుంది. వారిని చూస్తుంటే అభిమానులకు కన్నుల పండువగా ఉంటుంది కదా..! ఇప్పుడు మన నేచురల్ స్టార్ నాని అలాంటి ఫోటోనే షేర్ చేశాడు.
నాని తన చిన్నతనంలో ఎలా ఉన్నాడో.. ఇప్పుడు తన కొడుకు అచ్చం అలాగే ఉన్నాడు. ఇలాంటి ఓ ఫోటోను బాలల దినోత్సవం సందర్భంగా నాని తన ట్విట్టర్ ఖాతాలో ఫోస్ట్ చేశాడు. తన చిన్నప్పటి ఫొటోతో పాటు తన కొడుకు అర్జున్ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నాని ‘మేమిద్దరం ఒకేలా ఉన్నాం.. నిజజీవితంలో డ్యూయల్ రోల్’ అంటూ కామెంట్ చేశాడు. దీంతో ఈ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. నిజంగా ఇందులో నాని ఎవరు.. వాళ్ల బాబు అర్జున్ ఎవరో గుర్తుపట్టడం కష్టం. దీంతో ఈ ఫోటోను నెటిజన్లు రీట్వీట్ చేస్తూ ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు.
తాజా వార్తలు
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..