మరో 25 ఏళ్లుల్లో మార్స్ మీదకు మనిషి..
- November 15, 2018
హూస్టన్: మార్స్ గ్రహం మీదకు మనుషులను పంపేందుకు నాసా అనేక ప్రయోగాలు నిర్వహిస్తున్నది. అయితే మరో 25 ఏండ్లల్లో అరుణ గ్రహంపై మనుషులు కాలు మోపే అవకాశాలు ఉన్నట్లు నాసా వెల్లడించింది. అత్యంత ప్రమాదకరమైన రేడియేషన్ నుంచి వ్యోమగాములకు రక్షణ కల్పించే టెక్నాలజీ అభివృద్ధిని చేయాల్సి ఉందని నాసా తెలిపింది. మార్స్ గ్రహం భూమి నుంచి 14 కోట్ల మైళ్ల దూరంలో ఉన్నది. అయితే చంద్రుడిపై అపోల్ వ్యోమనౌకను పంపినప్పుడు ఎన్ని ఇబ్బందులో ఎదురయ్యాయో అంత కన్నా ఎక్కువే ఇబ్బందులు ఉంటాయని నాసా పేర్కొన్నది. మార్స్ గ్రహం వెళ్లేందుకు కనీసం 9 నెలల ప్రయాణం ఉంటుందని, అయితే ఆ సమయంలో సౌర కాంతి నుంచి రేడియేషన్ ఉంటుందని, దానికి తగ్గట్లుగా షీల్డ్‌లను తయారు చేయాల్సి ఉంటుందని నాసా అభిప్రాయపడింది. బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకుని అంచనా వేస్తే, మార్స్ మిషన్ నిజం కావాలంటే కనీసం 25 ఏళ్ల సమయం పడుతుందని మాజీ ఆస్ట్రోనాట్ టామ్ జోన్స్ తెలిపారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







