నింగిలోకి దూసుకెళ్ళిన యూఏఈ శాటిలైట్
- November 17, 2018యూఏఈ విద్యార్థులు తయారు చేసిన నానో శాటిలైట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్ళింది. వర్జీనియాలోని మిడ్ అట్లాంటిక్ రీజినల్ స్పేస్‌పోర్ట్ నుంచి ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించారు. సిగ్నస్ ఎన్‌సి10 ఫ్లైట్ ద్వారా ఈ ఉపగ్రహం నింగిలోకి వెళ్ళింది. నవంబర్ 15న ముందుగా ఈ శాటిలైట్‌ని ప్రయోగించాలనుకున్నా, కొన్ని కారణాలతో రెండు రోజులు ఆలస్యంగా అంటే నవంబర్ 17న లాంఛ్ చేశారు. ఎడ్యుకేషనల్ అవసరాల కోసం ఈ నానోశాటిలైట్ని రూపొందించారు. దీంట్లో ఓ కెమెరా భూమిని అబ్జర్వేషన్ చేయడానికి ఉపయోగపడ్తుంది. మస్దార్ ఇన్స్టిట్యూట్ దీన్ని డెవలప్ చేసింది. నెల రోజుల్లో యూఏఈ నిర్మించిన రెండో స్పేస్ ఆబ్జెక్ట్‌గా దీన్ని అభివర్ణించొచ్చు. ఇటీవలే ఖలీఫా శాటిలైట్‌ని జపాన్ నుంచి ప్రయోగించడం జరిగింది.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్‌లుగా యూఏఈ ల్యాండ్‌మార్క్‌లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్‌లో నిందితుడి అరెస్ట్