ఇండియా:ఇంజిన్ లేని ట్రైన్.. ట్రైయిల్ రన్ సక్సెస్..

- November 19, 2018 , by Maagulf
ఇండియా:ఇంజిన్ లేని ట్రైన్.. ట్రైయిల్ రన్ సక్సెస్..

ఇండియా:పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఇంజిన్ రహిత రైలును ప్రయోగాత్మకంగా పరీక్షించారు. ట్రైన్‌-18గా పేర్కొనే ఈరైలు మొరాదాబాద్-రాంపూర్ మధ్య పరుగులు పెట్టింది. వివిధ స్థాయిల్లో రైలు వేగాన్ని, ట్రైన్ బ్రేక్‌ల పనితీరును పరిశీలించారు. ఈ రైలును మొదట మొరాదాబాద్-బరేలి మధ్య ట్రయల్ రన్ నిర్వహించాలని భావించినప్పటికీ, పరిస్థితులు అనుకూలించకపోవడంతో మొరాదాబాద్-రాంపూర్ మధ్య పరీక్షించారు.

ఈ ట్రైన్ గంటకు 220 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించగలదని అధికార వర్గాలు తెలిపాయి. 16 బోగీలతో ఉండే ఈ రైలులో దివ్వాంగులకు ప్రత్యేక మరుగుదొడ్లు, చిన్న పిల్లలకు ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. డ్రైవర్ బోగీకి రెండు వైపుల నిఘా కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రయాణికుల కదలికలు తెలుసుకోవడంతో పాటు ప్రమాదాలను నివారించడానికి ఈ కెమెరాలు ఉపయోగ పడతాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com