తెలంగాణలో ముగిసిన నామినేషన్ల గడువు..
- November 19, 2018
తెలంగాణ:నామినేషన్ల దాఖలు గడువు పూర్తవ్వడంతో.. రేపటి నుంచి నామినేషన్ల పరిశీలన చేస్తారు. ఈ నెల 21, 22 తేదీల్లో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. దీంతో 22వ తేదీ తరువాత.. ఎంతమంది రెబల్స్ ఉన్నారు.. ఎంతమందిని ఆయా పార్టీల అధిష్టానాలు బుజ్జగించగలిగాయి అన్నదానిపై క్లారిటీ వస్తుంది.
ఇవాళ నామినేషన్లకు ఆఖరి రోజు కావడంతో అభ్యర్థులంతా అట్టహాసంగా నామినేషన్లు వేశారు. జనాన్ని సమీకరించి భారీ ర్యాలీతో నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారులకు సమర్పించి ముందే తమ బలప్రదర్శన చూపించారు..
చాలామంది ప్రముఖ నేతలు ఇవాళ నామినేషన్లు వేశారు. మంత్రి కేటీఆర్ సిరిసిల్లలోని రెవెన్యూ సబ్‌డివిజనల్ ఆఫీస్‌కు వచ్చి, రిటర్నింగ్ అధికారికి పత్రాలు సమర్పించారు. సింపుల్‌గా నామినేషన్ ఘట్టాన్ని పూర్తి చేశారు కేటీఆర్.
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సెంటిమెంట్‌గా మొదట తన తల్లి ఆశీర్వాదాలు తీసుకుని తరువాత నామినేషన్ వేశారు..
నాగార్జున సాగర్ నియోజకవర్గం మహాకూటమి అభ్యర్థిగా జానారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. భారీ జన సందోహంతో వచ్చి రిటర్నింగ్ అధికారికి పత్రాలు అందించారు. కేసీఆర్ మాయమాటల్ని ప్రజలు గ్రహించారని జానారెడ్డి అన్నారు.
మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా స్థానిక ఆలయంలో పూజలు నిర్వహించిన సబితా.. ఆ తరువాత ర్యాలీగా వెళ్లి నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందించారు.
కొడంగల్‌లో భారీ ర్యాలీగా వచ్చి నామినేషన్ వేశారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి. నామినేషన్ కార్యక్రమానికి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.
రాజేంద్రనగర్ టీఆర్ఎస్ అభ్యర్ధిగా ప్రకాష్ గౌడ్ నామిషేన్ వేశారు. భారీగా తరలివచ్చిన పార్టీ కార్యకర్తలతో ర్యాలీగా వెళ్ళి ఆయన నామినేషన్ దాఖలు చేశారు.
ఖమ్మం అసెంబ్లీ మహాకూటమి అభ్యర్ధిగా నామా నాగేశ్వరరావు నామినేషన్ వేశారు. తన తల్లి ఆశీర్వవాదం తీసుకుని భారీ ర్యాలీగా బయలుదేరి నామిషన్ వేశారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







