కలిసి ఉగ్రవాదాన్ని అంతమొందిద్దాం : మోదీ

- December 02, 2018 , by Maagulf
కలిసి ఉగ్రవాదాన్ని అంతమొందిద్దాం : మోదీ

జీ-20 సదస్సులో పాల్గొనేందుకు అర్జెంటీనా వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు యూరోపియన్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు డొనాల్డ్‌ టస్క్‌, ఈయూ కమిషన్‌ అధ్యక్షుడు జీన్‌ క్లౌడీ జంకర్‌, జర్మన్‌ ఛాన్సలర్‌ అంజెలా మార్కెల్‌తో పాటు పలువురు ఈయూ నేతలతో సమావేశమయ్యారు. భారత్‌-ఈయూ మధ్య సత్సంబంధాల బలోపేతం, సమన్వయంతో ఉగ్రవాదాన్ని అన్ని విధాలుగా అణచివేయడం వంటి విషయాలపై వారు చర్చించారు. ఈ ఏడాది నవంబరులో బ్రస్సేల్స్‌లో జరిగిన ఓ సమావేశంలోనూ పాల్గొన్న భారత్-ఈయూ.. ఉగ్రవాదం, తీవ్రవాదంతో పాటు సమాజాన్ని తప్పుదోవ పట్టించే అంశాలపై చర్చించి, వాటిని అంతమొందించే విషయంపై ఏకాభిప్రాయానికి వచ్చాయి.

అర్జెంటీనాలో మోదీ చర్చల గురించి భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రవీశ్‌ కుమార్‌ ట్వీటర్‌లో వివరాలు తెలిపారు. ఈ సమావేశం భారత్‌-ఈయూ మధ్య సత్సంబంధాల బలోపేతం, ఉగ్రవాదాన్ని అణచి వేయడానికి తీసుకోవాల్సి చర్యలు వంటి అంశాలపై, ఇందు కోసం దేశాల మధ్య సత్సంబంధాలు ఉండాల్సిన ప్రాముఖ్యతపై చర్చించారని చెప్పారు. తన పర్యటనలో భాగంగా మోదీ... నెదర్లాండ్‌ ప్రధాని మార్క్‌ రుట్టె, స్పెయిన్‌ ప్రధాని పెడ్రో సాంచెజ్‌తో కూడా సమావేశమయ్యారు. ఆయన ఇతర దేశాల అగ్రనేతలతోనూ ప్రత్యేకంగా భేటీ అవుతారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com