షిరిడీ సాయిబాబా ట్రస్ట్ నుంచి భారీ రుణం తీసుకున్న ప్రభుత్వం

- December 02, 2018 , by Maagulf
షిరిడీ సాయిబాబా ట్రస్ట్  నుంచి  భారీ రుణం తీసుకున్న ప్రభుత్వం

ముంబయి: మహారాష్ట్ర అనగానే మనందరి మనస్సులో మెదిలేది షిరిడి. అహ్మద్‌నగర్ జిల్లాలో షిరిడి దేవాలయం ఉంది. ఇప్పుడు కష్టాల్లో ఉన్న ఆ ప్రాంత ప్రజలను ఆదుకునేందుకు సాయిబాబా సహాయం అందిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వం షిరిడి సాయిబాబా దేవాలయం నుంచి భారీ మొత్తాన్ని అప్పుగా తీసుకోవాలని నిర్ణయించింది. అహ్మద్‌నగర్ జిల్లాలో తాగునీటి సమస్యను తీర్చేందుకు ఉద్దేశించిన నిల్వాండే ఇరిగేషన్ ప్రాజెక్టు పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు నగదు కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో సాయిబాబా టెంపుల్ ట్రస్ట్ ఆఫ్ షిరిడి నుంచి ఎలాంటి వడ్డీలేకుండా రూ.500 కోట్ల రుణాన్ని తీసుకోవాలని మహా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాజెక్టు పూర్తి చేసేందుకు అవసరమైన నిధుల కోసం దేవస్థానం ఛైర్‌పర్సన్, బీజేపీ నేత సురేశ్ హవారేను మహా సర్కార్ సంప్రదించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కోరిన నిధులను ఇచ్చేందుకు ఆయన ఒప్పుకున్నారు. వడ్డే లేకుండా ఇంత భారీ మొత్తాన్ని ప్రభుత్వ సంస్థలకు గతంలో ఎప్పుకూ కూడా ఇవ్వలేదు. మరోవైపు రుణాన్ని ఎప్పుడు తిరిగి చెల్లించేందుకు ఎలాంటి గడువు కూడా టెంపుల్ బోర్డు విధించలేదు.

రుణం ప్రతిపాదనకు ఫిబ్రవరి 1న ఆమోదం లభించగా.. రెండు విడతల్లో నిధులు విడుదల చేసేందుకు శనివారం తుది ఉత్తర్వులు జారీ చేసింది. ఆలయ విశేషాలు.. దేవాలయం పేరిట ఇప్పటి వరకు రూ.2,100కోట్లు డిపాజిట్లు ఉన్నాయి.

ప్రతిరోజు రూ.2కోట్లకు పైగా ఆదాయం వస్తోంది. ఏడాదికి సుమారు రూ.700కోట్లకుపైనే ఇన్‌కమ్ వస్తోంది. ప్రతిరోజు 70వేలకు పైగా భక్తులు వస్తుండగా.. పండుగల సమయంలో 3.5లక్షల మంది సాయి భక్తులు వస్తారని అంచనా.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com