ఉల్లిపాయను నూనెలో వేయించి తీసుకుంటే..
- December 27, 2018నిత్యం ప్రతిరోజూ వండుకునే కూరల్లో ఉల్లిపాయ కచ్చితంగా ఉంటుంది. ఇది లేకుండా ఏ కూర, ఏ వంట పూర్తికాదు. చాలామంది ఉల్లిపాయలను పచ్చిగానే తీసుకుంటారు. దీనిని ఎలా తీసుకున్నా ఆరోగ్యానికి మంచిదే అంటున్నారు. మరి దీనిలోని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం...
1. ఉల్లిపాయలోని విటమిన్ సి, బి1, బి6, యాంటీ సెప్టిక్, యాంటీబయాకిట్ గుణాలు.. చలికాలంలో వచ్చే శ్వాసకోస వ్యాధుల నుండి ఉపశమనం కలిగేలా చేస్తాయి. దాంతో శరీరం ఎలాంటి ఇన్ఫెక్షన్స్కు గురవకుండా ఉంటుంది.
2. ఉల్లిపాయలో క్రోమియం అనే పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది మధుమేహ వ్యాధికి చాలా ఉపయోగపడుతుంది. తరచు ఉల్లిపాయతో చేసిన వంటకాలు తీసుకుంటే వ్యాధి తగ్గుముఖం పడుతుంది. షుగర్ లెవల్స్ తగ్గుతాయి.
3. జలుబుతో బాధపడేవారు.. ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వాటిని నూనెలో వేయించి అందులో కొద్దిగా ఉప్పు, కారం, శెనగపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు రెండుపూటలా తీసుకుంటే జలుబు వెంటనే తగ్గుతుంది.
4. ప్రతిరోజూ భోజనం చేసిన తరువాత కొన్ని ఉల్లిపాయ ముక్కలను పచ్చిగా తీసుకోవాలి. ఇలా చేస్తే ఆస్తమా వ్యాధి రాదు. ఉల్లిపాయల రసంలా చేసుకుని అందులో స్పూన్ మోతాదులో కొద్దిగా ఉప్పు, నిమ్మరసం, అన్నం వంచిన గంజి కలిపి తాగితే ఫలితం ఉంటుంది.
5. చలికాలంలో చర్మం ఎక్కువగా పగిలి పుండుగా మారుతుంది. అందుకు ఏం చేయాలంటే.. ఉల్లిపాయ రసాన్ని చర్మానికి రాసుకోవాలి. గంటపాటు అలానే ఉంచి ఆ తరువాత శుభ్రం చేసుకుంటే చర్మం పగలకుండా ఉంటుంది.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం