పారిస్‌లో భారీ పేలుడు
- January 12, 2019ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో భారీ పేలుడు సంభవించింది. శనివారం నాడు ఉదయం ఆరోన్‌డిస్‌మెంట్ ప్రాంగణంలో భారీ పేలుడు జరిగింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. పేలుడు కారణంగా అక్కడి భవనాలు ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. ఎవరైనా ప్రాణాలు కోల్పోయారా అన్న విషయం తెలియాల్సి ఉందని, పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రమాదం జరిగిన భవనంలోని ఓ బేకరిలో గ్యాస్ లీకై పేలుడు సంభవించినట్లు పోలీసులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- IELTS కు బహ్రెయిన్ విద్యార్థులు ఆసక్తి..!
- రియాద్‌లో మొదటి ఈయూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రారంభం
- మోటార్‌సైకిల్‌కు నిప్పంటించిన ముగ్గురు అరెస్టు
- 2024 చివరి నాటికి యూనిఫైడ్ GCC టూరిస్ట్ వీసా
- యూఏఈలో ICSE, ISC ఫలితాలు విడుదల
- హట్టా పర్వతాల నుండి బ్రిటిష్ హైకర్ ఎయిర్ లిఫ్ట్
- అహ్మదీ గవర్నర్‌ను కలిసిన భారత రాయబారి
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్‌కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…