త్వరలోనే ఎన్నారై పాలసీ తీసుకొస్తాం : ఎంపీ కవిత

త్వరలోనే ఎన్నారై పాలసీ తీసుకొస్తాం : ఎంపీ కవిత

తెలంగాణ భవన్ లో ఎన్నారై టీఆర్ఎస్ యూకే సెల్ 8వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వార్షికోత్సవ కార్యక్రమంలో నిజామాబాద్ ఎంపీ కవిత, ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, బేవరేజస్ కార్పొరేషన్ చైర్మన్ దేవీప్రసాద్, యూకే సెల్ అధ్యక్షుడు అనిల్ కుర్మాచలంతో పాటు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ.. ఇప్పటికే 33 దేశాల్లో టీఆర్ఎస్ జెండా ఎగురుతున్నదని తెలిపారు. ఎన్ని కష్టాలున్నా టీఆర్ఎస్ ఎన్నారై శాఖను ముందుకు తీసుకెళ్లారు. విదేశాల్లో ఉన్న తెలంగాణ బిడ్డలు గర్వించేలా టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని కవిత స్పష్టం చేశారు. ఎన్నారై పాలసీ మీద కేటీఆర్ పని చేస్తున్నారని తెలిపారు. టీఆర్ఎస్ ఎన్నారై శాఖతో కలిసి త్వరలో ఎన్నారై పాలసీ తీసుకొస్తామన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో యావత్ తెలంగాణ జాతి గర్వపడేలా పని చేద్దామని కవిత పిలుపునిచ్చారు.

Back to Top