భారతీయులకు ఎఫెక్ట్‌ ఇవ్వనున్న హెచ్‌1బీ మార్పులు..

- January 16, 2019 , by Maagulf
భారతీయులకు ఎఫెక్ట్‌ ఇవ్వనున్న హెచ్‌1బీ మార్పులు..

వాషింగ్టన్‌: హెచ్‌-1బీ వీసాలో మార్పులు చేయడం వల్ల భారతీయులను ఎంపిక చేసుకునే ఐటీ కంపెనీలపై ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉందని ఐక్రా రేటింగ్‌ ఏజెన్సీ అభిప్రాయం వ్యక్తం చేసింది. అత్యంత నైపుణ్యం, అడ్వాన్స్‌డ్‌ డిగ్రీ ఉన్న వారికి అధిక ప్రాధాన్యం ఇచ్చేలాగా హెచ్‌1బీలో మార్పులు చేసేందుకు ట్రంప్‌ యంత్రాంగం ప్రయత్నిస్తోన్న విషయం తెలిసిందే. దీని కారణంగా హెచ్‌-1బీ కోసం దరఖాస్తు చేసుకునే విదేశీయులకు లభించే వాటిలో 10 శాతం తగ్గే అవకాశం ఉంది. వాళ్లకు బదులుగా అడ్వాన్స్‌డ్‌ డిగ్రీ మాస్టర్స్‌ లేదా అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యనభ్యసించిన వారికి ముందస్తు ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉందని ఐక్రా అభిప్రాయపడింది.

ఈ మార్పులు అమెరికాలోని ఐటీ కంపెనీలపై పడే అవకాశం ఉంది. దీని వల్ల హెచ్‌ 1బీ వీసాలపై ఉద్యోగులను నియమించుకునే కంపెనీలకు నష్టం వాటిల్లే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ విధానం భారత్‌ ఐటీ కంపెనీలకు వ్యతిరేకంగా ఉంది. ప్రస్తుతం అమెరికా కాంగ్రెస్‌ నిబంధనల ప్రకారం ఏటా 65వేల హెచ్‌ 1బీ వీసాలు జారీ చేయాలి. దీంతో పాటు అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించిన వారికి 20వేల వీసాలు ఇవ్వాలి. తాజాగా ప్రతిపాదించే నిబంధనల ప్రకారం యూఎస్‌లో చదువుకుని, అడ్వాన్స్‌డ్‌ డిగ్రీ ఉన్న వారికి అధిక ప్రాధాన్యం కలుగుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com