మస్కట్‌లో న్యూ ఇండియన్ స్కూల్ త్వరలో ప్రారంభం
- January 16, 2019
మస్కట్: ఇండియన్ స్కూల్స్ ఇన్ ఒమన్ - బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్‌లో ఇండియన్ స్కూల్ బౌషర్ హేండోవర్ కార్యక్రమం జరిగింది. క్యాపిటల్ ఏరియాలో ఇది ఏడవ ఇండియన్ స్కూల్ కాగా, ఒమన్ సుల్తానేట్‌లో మొత్తంగా ఇది 21వది. స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ స్కూల్ మెరుగైన విద్యను అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇండియన్ స్కూల్స్ ఇన్ ఒమన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఛైర్మన్ డాక్టర్ బేబీ సామ్ సామ్యుయేల్ మాట్లాడుతూ, వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్‌ని ఈ స్కూల్‌లో అందిస్తున్నట్లు తెలిపారు. స్విమ్మింగ్, స్ప్లాష్ పూల్స్, వెల్‌నెస్ సెంటర్, వరల్డ్ స్టాండర్డ్ సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్స్, సైకిలింగ్ ట్రాక్, ఫుట్‌బాల్ గ్రౌండ్, బాస్కెట్ బాల్ కోర్ట్, క్రికెట్ పిచ్‌చ, కబడ్డి ప్లే ఏరియా వంటి సౌకర్యాలు ఈ స్కూల్‌లో ఏర్పాటు చేశారు. అత్యున్నత లైబ్రరీలు, మోడ్రన్ ఎమినిటీస్, మ్యూజిక్ రూమ్, రిసోర్స్ సెంటర్, స్టెమ్ లేబరేటరీస్, రోబోటిక్స్ సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ లెర్నింగ్, కిండర్‌గార్టెన్ ప్లే ఏరియా కూడా వున్నాయిక్కడ.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







