'సాహో- చాప్టర్ 2'..అదరకొట్టేసిన ప్రభాస్
- March 03, 2019యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్-శ్రద్ద కపూర్ జంటగా సుజిత్ డైరెక్షన్లో యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం 'సాహో'. తెలుగు , తమిళ్ , హిందీ భాషల్లో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీ ఫై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్లే సినిమా తెరకెక్కుతోందని సాహో చాప్టర్ 1 వీడియోనే చెప్పింది.
ఈ అంచనాలను మరింత రెట్టింపు చేసేందుకు మరో చాప్టర్ వచ్చేసింది . ఈరోజు శ్రద్ద కపూర్ పుట్టిన రోజు సందర్బంగా సాహో మేకర్స్ 'షేడ్స్ ఆఫ్ సాహో- చాప్టర్ 2' పేరిట సరికొత్త టీజర్ ను విడుదల చేసింది. ఈ టీజర్ మొత్తం యాక్షన్ తో నింపేశారు. విలన్లతో ఛేజింగ్ లు , భారీ సెట్టింగ్లు , హెవీ యాక్షన్ తో నింపేశారు. ఈ టీజర్ లో ప్రభాస్ కనిపించకపోవచ్చని ప్రచారం జరిగింది. కానీ ఈ 'షేడ్స్ ఆఫ్ సాహో- చాప్టర్ 2' లో ప్రభాస్ కనిపించాడు. విలన్లతో ఫైట్ చేస్తూ కనిపించాడు. సన్నివేశాలు హాలీవుడ్ సినిమాని తలపిస్తున్నాయి. చివర్లో శ్రద్ద కనిపించి ఆకట్టుకుంది. ఆగస్ట్ 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
తాజా వార్తలు
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు
- కువైట్లో బ్యాచిలర్లకు కొత్త కష్టాలు..!
- QR247 మిలియన్లు తిరిగి చెల్లించాలని సీఈఓను ఆదేశించిన కోర్టు
- 2023లో 99%కి చేరుకున్న సౌదీ ఇంటర్నెట్ వినియోగం
- మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం.. అగ్రస్థానంలో భారతీయులు
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ సీజన్..మరో 3 రోజులు పొడిగింపు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం