4 భాషల్లో విడుదల కానున్న 'డియర్ కామ్రేడ్'
- March 08, 2019'గీత గోవిందం' .. 'టాక్సీవాలా' విజయాలతో విజయ్ దేవరకొండ మంచి జోరుమీదున్నాడు. ఆయన తదుపరి చిత్రంగా 'డియర్ కామ్రేడ్' రూపొందుతోంది. భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో కథానాయికగా రష్మిక నటిస్తోంది. షూటింగు పరంగా ఈ సినిమా ముగింపుదశకి చేరుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చకచకా జరిగిపోతున్నాయి. విభిన్నమైన ప్రేమ కథాంశంతో నిర్మితమవుతోన్న ఈ సినిమాను, తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ భాషల్లో మే 22వ తేదీన భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ కారణంగానే టీజర్ ను ఈ నాలుగు భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. టీజర్ రిలీజ్ కి ఈ నెల 17వ తేదీని ముహూర్తంగా నిర్ణయించారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమాలో, మెడికల్ స్టూడెంట్ గా విజయ్ దేవరకొండ .. క్రికెటర్ గా రష్మిక మందన కనిపించనున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- రూ.13.56 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
- గురుద్వారా సందర్శన..పాయసం వడ్డించిన ప్రధాని మోడీ
- Dh4,000కే GCC టూర్..యూనిఫైడ్ టూరిస్ట్ వీసా!
- హెయిర్ స్ట్రెయిట్నింగ్ తో కిడ్నీ సమస్యలు..?
- బహ్రెయిన్ లో రెండు రోజులపాటు స్కూళ్లకు సెలవులు
- జోర్డాన్ 'ఈగర్ లయన్ 2024'లో సౌదీ సాయుధ దళాలు
- భారత్-ఒమన్ మధ్య పెరిగిన విమాన ఛార్జీలు..!
- కువైట్ లో కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం
- ఏపీలో 9.05 శాతం..తెలంగాణలో 9.51 శాతంగా పోలింగ్ నమోదు
- సీబీఎస్ఈ క్లాస్ 10 ఫలితాలు విడుదల..