ఈ యాప్ ద్వారా మీ ఓటు ఉందో ..లేదో తెలుసుకోవచ్చు
- March 09, 2019ఎన్నికల పమీపిస్తున్న వేళ ఓట్ల గల్లంతు అంశం ఓటర్లను ఉక్కిరిబిక్కరి చేస్తుంది. తాజాగా జరుగుతన్న పరిణామాలు కూడా ఓటర్లను మరిం గందరగోళానికి గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమ ఓట్లు గల్లంతైందా లేక ఉందా అనే తదితర వివరాలు తెలుసుకోవడానికి ఓ అవకాశం ఉంది. ఇందుకు గూగుల్ ఫ్లే స్టోర్ నుంచి ఓటర్ హెల్ఫ్‌లైన్ అనే యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. దాన్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సెర్చ్ యువర్ నేమ్ ఇన్ ఎలక్ట్రోల్ రోల్‌పై క్లిక్ చేయాలి
వాటిలో ఉన్న ఆప్షన్ల ప్రకారం ఓటరు పేరు, తండ్రి పేరు, వయస్సు, నియోజకవర్గం, జిల్లా వంటి వివరాలు నమోదు చేయాలి
మీ వివరాలు ఓటరు జాబితిలో ఉంటే వెంటనే స్మార్ట్‌ఫోన్‌లో తెరపై సమగ్ర వివరాలు ప్రత్యక్షమవుతాయి.
ఇలా మీకు ఓటు ఉందా?లేదో తెలుసుకోవచ్చు
అలా కాకుండా ఓటరు కార్డు నంబరు తెలిసి ఉంటే ఆ నంబరును యాప్‌లో నమోదు చేయడం ద్వారా కూడా ఓటు ఉందో లేదో తెలుసుకోవచ్చు.
స్మార్ట్ ఫోన్ లేని వారు టోల్‌ఫ్రీ నంబరు 1950 కు కాల్ చేయడం ద్వారా కూడా ఓటరు వివరాలు తెలుసుకోవచ్చు.
ఓటరు ప్రమెయం లేకుండా ఓటును తొలిగిస్తే యాప్ ద్వారానే అధికారులకు ఫిర్యాదు చేసే అవకాశం కూడా ఉంది
అలాగే కొత్తగా ఓటు నమోదు చేసుకునేందుకు ఫారం-6,తొలగింపునకు ఫారం-7, వివరాల మార్పునకు ఫారం-8.. లాంటి పామ్‌లు కూడా ఈ యాప్ ఉన్నాయి.
ఎన్నికల సంఘం నిర్ణయాలు,ప్రకటనలు కూడా దానిలో ఉంటాయి
అభ్యర్థులు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినా యాప్ ద్వారా ఈసీకి ఫిర్యాదు చేయవచ్చు.
ఈవీఎంలు, వీవీ ప్యాట్ల ఎలా ఉపయోగించాలి అన్న అంశాలపై కూడా ఈ యాప్‌లో అవగాహన వీడియోలు ఉన్నాయి.
తాజా వార్తలు
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు
- కువైట్‌లో బ్యాచిలర్లకు కొత్త కష్టాలు..!
- QR247 మిలియన్లు తిరిగి చెల్లించాలని సీఈఓను ఆదేశించిన కోర్టు
- 2023లో 99%కి చేరుకున్న సౌదీ ఇంటర్నెట్ వినియోగం
- మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం.. అగ్రస్థానంలో భారతీయులు
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ సీజన్..మరో 3 రోజులు పొడిగింపు
- పాకిస్థాన్‌లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం