ఎల్ఐసీ నుంచి ఆమ్ ఆద్మీ బీమా యోజన.. సంవత్సరానికి రూ.200లు కడితే..

- March 09, 2019 , by Maagulf
ఎల్ఐసీ నుంచి ఆమ్ ఆద్మీ బీమా యోజన.. సంవత్సరానికి రూ.200లు కడితే..

ఆమ్ ఆద్మీ బీమా యోజన స్కీమ్ లైఫ్ ఇన్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన ఈ స్కీమ్ అసంఘటిత రంగ కార్మికుల కోసం ఉద్దేశించిన పథకం ఇది. అంటే శాలరీ బేస్డ్ కాని కార్మికులు.

 
18 నుంచి 59 ఏళ్ల వయసు ఉన్న వాళ్లు ఈ పథకంలో చేరవచ్చు. 
ఈ స్కీమ్‌లో చేరాలంటే.. ఏజ్ ప్రూఫ్ కోసం రేషన్ కార్డు, బర్త్ రిజిస్టర్‌లో నమోదైన రికార్డు, స్కూల్ సర్టిఫికెట్, ఓటర్ లిస్ట్, ప్రభుత్వ శాఖ లేదా ప్రముఖ సంస్థ జారీ చేసిన ఐడీ కార్డు, ఆధార్ కార్డు ఏదైనా ఒకటి ఉండాలి. 
కుటుంబంలో ఒకరే సంపాదిస్తున్న భూమి లేని నిరుపేదలు, వివిధ వృత్తులు చేసుకునేవారు అర్హులు. 
ఈ పథకంలో చేరిన వారు వార్షికంగా రూ.200 ప్రీమియం చెల్లించాలి. 
సహజంగా మరణిస్తే రూ.30,000
ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.75,000
శాశ్వత వైకల్యం, లేదా రెండు అవయవాలు కోల్పోయిన వారికి రూ.75,000 లేదా ఒక అవయవం కోల్పోయిన వారికి రూ.37,000 బీమా ఇస్తారు. 
ఆమ్ ఆద్మీ అదనపు ప్రయోజనాలు..
స్కీమ్ పాల్గొన్న సభ్యుల ఇద్దరు పిల్లలకు 9 నుంచి 12 మధ్యలో చదువుతున్న వారికి ప్రతినెలా ఎల్‌ఐసీ నుంచి ఒక్కొక్కరికి రూ.100లు అందుతుంది. ఆరు నెలలకోసారి స్కాలర్ షిప్ రూపంలో మరికొంత మొత్తం చెల్లించబడుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com