దుబాయ్:రాజకుటుంబాన్నిమోసం చేసిన భారతీయ పూజారి అరెస్ట్..!

దుబాయ్:రాజకుటుంబాన్నిమోసం చేసిన భారతీయ పూజారి అరెస్ట్..!

దుబాయ్‌:దుబాయ్‌ లో ఒక భారతీయ పూజారి నాసిక్ కాలారామ్ ఆలయ ప్రధాన అర్చకుడు మహంత్ సుధీర్ దాస్ పూజారి ను దుబాయ్ నుంచి ఇండియా వెళ్తుండగా విమానాశ్రయం లో అరెస్ట్ చేసారు.పూజారి ఒక రాజకుటుంబ సభ్యుడ్ని మోసం చేశారన్న ఆరోపణలతో దుబాయ్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, అరెస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. సుధీర్ దాస్ బెయిల్ కోసం సహకరించినట్టు దుబాయ్‌లోని ఇండియన్ కాన్సుల్ జనరల్ ప్రకటించింది. సుధీర్ దాస్ బెయిల్‌పై బయటకు వచ్చినా ఆయన పాస్‌పోర్టును మాత్రం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

కానీ, తన పాస్‌పోర్ట్ పోగొట్టుకున్నానని, ప్రస్తుతం షార్జాలో ఉన్నానని నాసిక్‌లోని తన సన్నిహితులకు పూజారీ చెప్పడం విశేషం. అర్చకుడి వ్యవహారంలో సహాయం చేయాలని విదేశాంగ శాఖకు నాసిక్ MP మరియు MLA లు లేఖ రాశారు.దుబాయ్ అధికారులతో మాట్లాడి సుధీర్ పాస్‌పోర్ట్ ఇప్పించడానికి చర్యలు తీసుకుని, స్వదేశానికి వచ్చే ఏర్పాట్లు చేయాలని ఆ లేఖలో పేర్కొన్నారు. 

ఇటీవలే ముంబయి నుంచి దుబాయ్‌కు తన వ్యాపార కార్యకలాపాలను విస్తరించిన సుధీర్ దాస్, అక్కడ పలు సంస్థలను ప్రారంభించినట్టు సమాచారం.

Back to Top