ఆటిజం బాధిత చిన్నారులకోసం 10,000 బహ్రెయినీ దినార్స్ సేకరణ
- April 15, 2019రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్‌కి చెందిన రోటరాక్ట్ బహ్రెయిన్, వార్షిక చారిటీ ఫండ్ రైజర్ ఈవెంట్‌ని 'ఎగైనెస్ట్ ది క్లాక్' (ఎటిసి) పేరుతో అల్ బందర్ హోటల్ మరియు రిసార్ట్‌లో నిర్వహించింది. ఈ ఈవెంట్ ద్వారా 10,000 దిర్హామ్‌ల ఫండ్‌ని సేకరించారు. ఆటిజంతో బాధపడే చిన్నారుల కోసం ఈ నిధుల్ని వినియోగించనున్నారు. రోటరాక్ట్ బహ్రెయిన్‌కి రోటరీ క్లబ్ ఆఫ్ సల్మానియా, మనామా మరియు అదిలియా ఇతర ప్రపంచ స్థాయి సర్వీస్ ఆర్గనైజేషన్స్ సహాయ సహకారాలు అందిస్తున్నాయి. 'సర్వీస్ ఎబౌ యువర్సెల్ఫ్' నినాదంతో ఇవి పనిచేస్తున్నాయి. రోటరీ ఆర్గనైజేషన్‌కి 50 ఏళ్ళ అనుభవం ఈ సేవా రంగంలో వుంది. ఒమనెయాత్ ఫౌండేషన్ ఫర్ ఆటిజం మరియు ఇతర సొసైటీలు సంయుక్తంగా ఫండ్స్‌ని సేకరించి, బాధిత చిన్నారులకు అండగా నిలుస్తున్నాయి.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్‌లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!